News October 23, 2024
ఒంగోలు: పశుగణన సర్వే పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు “21వ అఖిల భారత పశుగణన” సర్వే చేపట్టబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టరును మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్థక అధికారి బేబీరాణి సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. పశువులకు సంబంధించిన సమగ్ర గణాంకాలు ఉంటే వాటికి సంబంధించిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా రూపొందించగలదని కలెక్టర్ అన్నారు.
Similar News
News November 28, 2025
అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.
News November 28, 2025
ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు బంద్..?

మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం వారు ఒంగోలులో మాట్లాడారు. విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. విద్యాసంస్థల బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా యూనివర్సిటీ త్రిబుల్ ఐటీకి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


