News March 21, 2025

ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

image

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

Similar News

News February 23, 2026

హలీమ్ చెఫ్‌లకు అదిరిపోయే ప్యాకేజీలు.. రోజుకు ఎంతంటే..

image

TG: రంజాన్ సీజన్‌లో హలీమ్ చెఫ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని పెద్ద హోటళ్లు రోజుకు కనీసం ₹5 వేలు చెల్లిస్తున్నాయి. ఇతర పట్టణాల్లోనూ హైదరాబాద్ నుంచి చెఫ్‌లను పిలిపించుకుని రోజుకు ₹3 వేలు చెల్లిస్తున్నారు. కొన్ని బడా హోటళ్లు, రెస్టారెంట్లు 6 నెలల ముందే వారిని బుక్ చేసుకోవడం గమనార్హం. రంజాన్ తర్వాత హలీమ్ చెఫ్‌లు హైదరాబాద్‌లోని క్యాటరింగ్ సెంటర్లు, హోటళ్లలో బిర్యానీ తయారీలో బిజీగా ఉంటారు.

News February 23, 2026

ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రభావం

image

గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమతుల్యత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలలో తేడా వస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, ప్రీక్లాంప్సియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి గర్భిణీ శరీరానికి మాత్రమే కాకుండా శిశువు ఆరోగ్యానికీ ప్రమాదం. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకొని దానికి తగ్గట్లు మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.

News February 23, 2026

శనిదేవుడిని శాసించిన మహా తపస్వి

image

దధీచి మహర్షి కుమారుడే పిప్పలాద మహర్షి. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆయన మేనత్త వద్ద పెరిగాడు. తండ్రి మరణానికి ఇంద్రుడడని తెలిసి పగతో రగిలిపోయాడు. శివుడికై తపస్సు చేశాడు. శివుడు అతడిని శాంతింపజేసి అది విధి అని వివరించాడు. ఈయన ప్రశ్న ఉపనిషత్తు రాశారు. శనిదేవుడిని ఓడించి పిన్న వయసులో ఉన్నవారిని ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. చిన్నతనంలో ‘పిప్పల’(రావి) చెట్టు పండ్లను తిని జీవించడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది.