News June 11, 2024

ఒంగోలు: పాఠశాలల ప్రారంభం రోజే కిట్ల పంపిణీ

image

పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసేందుకు ఒంగోలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మండలాలకు బ్యాగ్లు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ తదితర వస్తువులు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌ఎంకు రవాణా ఛార్జీలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్ పేరుతో పంపిణీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలందాయి.

Similar News

News December 5, 2025

ప్రకాశం: నెలకు రూ.2 లక్షల శాలరీ.. డోంట్ మిస్.!

image

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్‌‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

News December 5, 2025

జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!