News June 11, 2024
ఒంగోలు: పాఠశాలల ప్రారంభం రోజే కిట్ల పంపిణీ

పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసేందుకు ఒంగోలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మండలాలకు బ్యాగ్లు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ తదితర వస్తువులు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌ఎంకు రవాణా ఛార్జీలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్ పేరుతో పంపిణీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలందాయి.
Similar News
News March 17, 2025
మార్కాపురం: ఆస్తి తీసుకొని గెంటేశాడయ్యా!

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపల మడుగు కొత్తపల్లికి చెందిన వృద్ధుడు కోటయ్య కన్న కొడుకు గెంటేశాడని మార్కాపురం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించాడు. తన కొడుకు ఆస్తి మొత్తాన్ని తీసుకొని, అన్నం పెట్టకుండా గెంటేశాడని సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్‌కు ఫిర్యాదు చేశాడు. గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని కోటయ్య వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చాడు.
News March 17, 2025
ఒంగోలు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి

రాజ్యసభ సభ్యుడు, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) అనారోగ్యంతో ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఆమె మృతిపై పలువురు సంతాపం తెలిపారు. కొన్ని రోజులుగా ఎర్రం పిచ్చమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. పిచ్చమ్మ అంత్యక్రియలు ఈరోజా రేపా అనేది కుటుంబం సభ్యుల నుంచి సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 17, 2025
పదో తరగతి విద్యార్థులకు ALL THE BEST: ప్రకాశం SP

పదవ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆయన ALL THE BEST తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.