News December 23, 2024

ఒంగోలు పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎస్పీ మాట్లాడారు. క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమన్నారు.‌ క్రీస్తు బోధనలు మంచి మార్గంలో నడిపిస్తాయని‌ చెప్పారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను ఎస్పీ అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ పాల్గొన్నారు.

Similar News

News January 19, 2025

ప్రకాశం: నడుస్తూనే మృత్యు ఒడిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు

image

రోడ్డుపై తమ పనుల నిమిత్తం కాలిబాట పట్టిన ముగ్గురు వ్యక్తులు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామ సమీపంలో నాగిరెడ్డి నడుస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ప్రసన్నకుమార్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం చౌటపల్లి వద్ద నాగయ్యను ట్రాలీ ఆటో ఢీ కొనడంతో మృతి చెందాడు.

News January 19, 2025

పాకలలో నలుగురు మృతి.. అసలు కారణం ఇదే.!

image

పాకల బీచ్‌లో 2 రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పాకల బీచ్‌లో ఉన్న చిన్నచిన్న గుంతల కారణంగా కడ్సలు (సుడిగుండాలు) ఏర్పడుతాయని, వీటిలో చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మత్స్యకారులు తెలిపారు. శివన్నపాలెం గ్రామానికి చెందిన నవ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కడ్సల బారి నుంచి తప్పించుకుందని వారు తెలిపారు.

News January 19, 2025

వరికూటి అశోక్ బాబుకి కీలక పదవి

image

కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.