News November 17, 2024

ఒంగోలు పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గేమ్‌ల వివరాలు ఇవే

image

ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో‌ శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు వాలీ బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో, మహిళలకు వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలతోపాటు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.

Similar News

News December 5, 2025

ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

image

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

News December 5, 2025

MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్‌ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.