News December 29, 2024

ఒంగోలు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం రద్దు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) మీకోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. సోమవారం పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఫిర్యాదారులు ఈ విషయాన్ని గుర్తించి దూర ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని ఎస్పీ తెలిపారు.

Similar News

News January 6, 2025

అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: బాపట్ల కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, అధికారులు పాల్గొన్నారు

News January 6, 2025

ప్రకాశం: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు చీరాల, ఒంగోలు స్టేషన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.

News January 6, 2025

ప్రకాశం: నకిలీ పెన్షన్లపై వేటుకు రంగం సిద్ధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న నకిలీ పెన్షన్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. వికలాంగులు, వృద్ధాప్య తదితర పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో లక్షలమంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌ పెన్షన్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నేటినుంచి వాటి లెక్కను పెద్ద ఆసుపత్రుల డాక్టర్ల బృందం ఇళ్లకే వచ్చి మరీ లబ్ధిదారులను టెస్ట్ చేయనుంది.