News December 16, 2024
ఒంగోలు: బైకుపై లిఫ్ట్ ఇస్తే అంతే..!

హైవేపై లిఫ్ట్ ఇవ్వడం ఎంత డేంజరో అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఉలవపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈనెల 11న బైకుపై వెళ్తుండగా GVR ఫ్యాక్టరీ వద్ద ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ప్లాన్ ప్రకారం కాస్త ముందుకు వెళ్లాక ఊళ్లపాలేనికి చెందిన ప్రశాంత్ ఫ్రెండ్స్ కొల్లా సాయి, పసుపులేటి శ్రీకాంత్.. వెంకటేశ్వర్లును బెదిరించి బైక్ తీసుకుని పారిపోయారు. సింగరాయకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 26, 2026
వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.