News December 16, 2024

ఒంగోలు: బైకుపై లిఫ్ట్ ఇస్తే అంతే..!

image

హైవేపై లిఫ్ట్ ఇవ్వడం ఎంత డేంజరో అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ఉలవపాడుకు చెందిన వెంకటేశ్వర్లు ఈనెల 11న బైకుపై వెళ్తుండగా GVR ఫ్యాక్టరీ వద్ద ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ప్లాన్ ప్రకారం కాస్త ముందుకు వెళ్లాక ఊళ్లపాలేనికి చెందిన ప్రశాంత్ ఫ్రెండ్స్ కొల్లా సాయి, పసుపులేటి శ్రీకాంత్.. వెంకటేశ్వర్లును బెదిరించి బైక్ తీసుకుని పారిపోయారు. సింగరాయకొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News January 18, 2025

కురిచేడు: ప్రేమించిన యువతి ఇంటి ముందే యువకుడు మృతి

image

ప్రేమించిన యువతి ఇంటి ముందే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కురిచేడులో చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ అగ్రహారానికి చెందిన యశ్వంత్ (25), ఓ యువతి ఐదేళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. కాగా ఆ యువతికి ఇటీవల వివాహం అయింది. పండుగకు ఆ యువతి పుట్టింటికి రావటంతో తిరునాళ్లకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పిన యశ్వంత్ ఆ యువతి వద్దకు వెళ్లాడు. తెల్లారేసరికి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 17, 2025

ప్రకాశం: నేడే విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్- డే అని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 17, 2025

ప్రకాశం: రాకాసి అలలకు ఓ ఫ్యామిలీ బలి

image

ప్రకాశం జిల్లా పాకల తీరంలో <<15170746>>నిన్న ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పొన్నలూరు మండంలం శివన్నపాలేనికి చెందిన మాధవ(25) ఫ్యామిలీ సముద్ర స్నానానికి వెళ్లింది. అలల తాకిడికి మాధవ చనిపోయాడు. ఆయన భార్య చెల్లెలు యామిని(15), బాబాయి కుమార్తె జెస్సిక(14) సైతం కన్నుమూసింది. మాధవ భార్య నవ్య సైతం సముద్రంలోకి కొట్టుకుపోతుండగా.. మత్స్యకారులు కాపాడారు.