News January 30, 2025

ఒంగోలు: మద్యం తాగి వచ్చిన వారికి నో టోకెన్

image

ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న క్యాంటీన్ వద్దకు ఎందరో ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేందుకు వస్తుంటారు. అదే సమయానికి పలువురు మద్యం ప్రియులు అన్న క్యాంటీన్ వద్ద హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఓ బోర్డును ఏర్పాటు చేశారు. మద్యం తాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వడం కుదరదని ఆ బోర్డు సారాంశం.

Similar News

News October 27, 2025

ప్రకాశం జిల్లాలో ‘మొంథా’ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో?

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ చర్చ సాగుతోంది. ఓ వైపు అధికారులు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ తుఫాన్ ప్రభావం సోమవారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో కనిపించే అవకాశం ఉంది. NDRF బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఏది ఏమైనా తుఫాన్ ఎఫెక్ట్ కాస్త తక్కువ ఉండేలా చూడు వరుణదేవా అంటూ ప్రజలనోట ఈ మాట వినిపిస్తోంది.

News October 27, 2025

నేటి కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.

News October 26, 2025

ప్రకాశం: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిలా కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కొండపి మండలంలో జరిగింది. తండ్రి మద్యం మత్తులో 12 ఏళ్ల కుమార్తెపై కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఈ విషయం తేలింది. దీంతో తల్లి బాలికను ఆరా తీయగా కన్నతండ్రే కాలయముడయ్యాడని తెలిపింది. కాగా కొండపి PSలో పోక్సో కేసు నమోదైంది.