News March 2, 2025
ఒంగోలు: ‘మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’

మహిళలందరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శనివారం నుంచి వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా.. శనివారం ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
Similar News
News March 15, 2025
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తున్నారో తెలుసా?

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 183 ఎగ్జామ్ సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లుగా డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లుగా వెల్లడించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.