News March 25, 2025
ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.
Similar News
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025

ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్‌లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.