News December 14, 2024
ఒంగోలు: ‘రహదారి భద్రత నిబంధనలు పాటించాలి’
ఒంగోలు ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆటో డ్రైవర్లు కాలేజీ బస్సుల యజమానులకు రహదారి భద్రతా నియమ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఉప రవాణా కమిషనర్ సుశీల మాట్లాడుతూ.. ఆటోలలో స్కూలు పిల్లలను తరలించవద్దని అధిక లోడుతో ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. సరియైన రికార్డులను కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని లేనట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News December 27, 2024
పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్
పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని చెప్పారు.
News December 27, 2024
బాపట్ల కలెక్టరేట్లో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీల వద్ద ఆయన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వేగంగా పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. జేసీ ప్రకార్ జైన్. ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 27, 2024
పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం: ఎస్పీ
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుంచి ఒంగోలులోని పోలీసు పెరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.