News December 14, 2024

ఒంగోలు: ‘రహదారి భద్రత నిబంధనలు పాటించాలి’

image

ఒంగోలు ఉపరవాణా కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఆటో డ్రైవర్లు కాలేజీ బస్సుల యజమానులకు రహదారి భద్రతా నియమ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఉప రవాణా కమిషనర్ సుశీల మాట్లాడుతూ.. ఆటోలలో స్కూలు పిల్లలను తరలించవద్దని అధిక లోడుతో ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. సరియైన రికార్డులను కలిగి ఉండాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలని లేనట్లయితే కేసులు నమోదు చేస్తామన్నారు.

Similar News

News January 22, 2025

ఒంగోలు రానున్న వందేమాతరం శ్రీనివాస్‌ 

image

అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని 22వ తేదీ ఒంగోలులోని సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్ళగుంట కృష్ణయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా  సంగీత దర్శకుడు వందేమాతరం. శ్రీనివాస్‌కు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు -2025ను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు.

News January 21, 2025

కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కొండపిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి(M) శంకరాపురానికి చెందిన దుర్గారావు, చిరంజీవి, ఆమీన్‌లు కామేపల్లి పోలేరమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొండపి JL కోల్డ్ స్టోరేజ్ దగ్గర కట్టెల ట్రాక్టర్ వారి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ఆమీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

PM అవార్డ్స్ కోసం ప్రతిపాదనలు పంపండి: ప్రకాశం కలెక్టర్

image

పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబరు నెలాఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.