News April 25, 2024

ఒంగోలు: రేపు జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష

image

జిల్లాలోని ఏపీ గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ప్రవేశ పరీక్షను 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.

Similar News

News January 24, 2025

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం

image

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గుణాత్మక విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు అన్నారు. గురువారం ఒంగోలులో జరిగిన ప్రకాశం- నెల్లూరు జిల్లాల విద్యాశాఖ అధికారుల, ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. గతంలో ప్రభుత్యం జారీ చేసిన జీవో 117ను మారుస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.

News January 23, 2025

డిప్యూటీ CMతో బాలినేని భేటీ

image

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

News January 23, 2025

ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్‌లో ఉడకబెట్టాడు

image

రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.