News July 30, 2024
ఒంగోలు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఒంగోలు, సూరారెడ్డిపాలెం మధ్య రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే కదులుతున్న రైలు నుంచి సదరు వ్యక్తి జారిపడి మృతి చెందినట్లు స్థానికులు రైల్వే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 21, 2025
ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
News November 21, 2025
కురిచేడు: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన

కురిచేడు మండలం కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News November 21, 2025
కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్మెన్గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


