News March 28, 2025
ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
Similar News
News April 20, 2025
ఒంగోలు: ‘జిల్లా అభివృద్ధి చెందేలా చర్యలు వేగవంతం చేయాలి’

వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా అన్ని విధాలా అభివృద్ది చెందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు తనను ప్రత్యేక అధికారిగా నియమించిందని తెలిపారు.
News April 19, 2025
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు నియామకం

టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన పైనం మధుబాబు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకి, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
News April 19, 2025
పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పీఎం సూర్య ఘర్ అమలును వేగవంతం చేయాలని, రోజువారిగా పురోగతి సాధించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లాలో పీ.ఎం. సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఇప్పటివరకు 78,766 దరఖాస్తులు రాగా, అందులో 1115 గ్రౌండింగ్ చేయగా, 736 మందికి సబ్సిడీ జమ చేసినట్లు పేర్కొన్నారు.