News September 24, 2024
ఒంగోలు: 108లో ఖాళీ పోస్టుల భర్తీకి మోక్షం

ప్రకాశం జిల్లాలోని 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మోక్షం లభించింది. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు 108 జిల్లా మేనేజర్ విజయకుమార్ తెలిపారు. డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి అర్హులైన వారు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 26న పాత రిమ్స్‌లోని కార్యాలయం దగ్గర డ్రైవింగ్ పరీక్ష కోసం హాజరుకావాలన్నారు.
Similar News
News January 4, 2026
పారిశుద్ధ్య కార్మికులకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

కొండపి, టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం మంత్రి స్వామి ఒంగోలు కలెక్టరేట్ ఆవరణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు డీపీఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ మల్లికార్జున్ ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు ఈ ఆటోలు ఉపయోగపడతాయన్నారు.
News January 4, 2026
ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు భద్రం: ఇన్‌ఛార్జ్ SP

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డాటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.