News April 3, 2025

ఒంగోలు: 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేసింది.

Similar News

News November 6, 2025

అధికారులకు ప్రకాశం కలెక్టర్ సూచనలు

image

లోప రహిత ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటినుంచే దృష్టిసారించాలని ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఈఆర్వోలను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఒంగోలు నుంచి కలెక్టర్ హాజరయ్యారు.

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.