News August 15, 2024

ఒంగోలు: 700 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం నగరంలో 700 మీటర్ల జాతీయ జెండా రాలీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుతో కలసి ప్రారంభించారు.

Similar News

News January 7, 2026

మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

image

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.

News January 7, 2026

కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

image

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్‌టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.

News January 7, 2026

ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

image

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్‌పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.