News July 28, 2024

ఒంగోలు: ‘APPSC పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

image

APPSC ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్‌మెంట్ పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్వో విశ్వేశ్వరరావు చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డిపార్ట్‌మెంట్ పరీక్షలు జిల్లాలోని 4 కేంద్రాలలో జరుగనున్నాయి. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాశం భవనంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం జరిగింది.

Similar News

News December 13, 2024

ప్రకాశం జిల్లాకు రూ.12 కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఎన్నో ఏళ్లనాటి కల. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ పేరు వింటూనే ఉన్నా పనులు పూర్తి కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్టు సంబంధించి సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. జిల్లా పరిధిలో ఈ రైల్వే లైన్ భూసేకరణకు పెండింగ్‌లో ఉన్న రూ.12 కోట్లు ఇవాళే(శుక్రవారం) విడుదల చేయాలని నిన్నటి సమావేశంలో ఆదేశించారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 12, 2024

కంభం: వీరుడికి కన్నీటితో సెల్యూట్

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

News December 12, 2024

సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

image

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.