News August 6, 2024
ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

అద్దె ఇల్లు కావాలని, ఇంట్లోకి చొరబడి దాడికి దిగి మహిళ మెడలోని బంగారు గొలుసును చోరీకి పాల్పడ్డ ఘటన ఒంగోలు ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఈమేరకు ఫిర్యాదు అందింది.
Similar News
News November 21, 2025
రేపు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్ష సూచన.!

దక్షిణ అండమాన్లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. వ్యవసాయ మోటార్ల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలిగాలుల ప్రభావం పెరిగింది.
News November 21, 2025
ప్రకాశం: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి

స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ధర్తీమాతా బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ధర్తీ మాత బచావో అభియాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన ఎరువులను వినియోగించేలా అధికారులు సూచించాలన్నారు.
News November 21, 2025
ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.


