News August 6, 2024

ఒంగోలు: TOLET బోర్డు చూసి.. ఇంట్లోకి చొరబడి దాడి

image

అద్దెకు ఇల్లు కావాలంటూ ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన ఒంగోలు ఒకటో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒంగోలులోని ఈమనిపాలెంలో నివసిస్తున్న సుగుణ తమకు గల మరో ఇంటి వద్ద అద్దెకు ఇస్తామంటూ TOLET బోర్డు ఏర్పాటు చేశారు. దీనితో ఓ అగంతకుడు ఫోన్ చేయగా, సుగుణ ఇల్లు చూపిస్తుండగా, దాడిచేసి బంగారు గొలుసు, ఫోన్ లాక్కెళ్ళినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.