News December 28, 2024

ఒంగోలు YCP కార్పొరేటర్‌పై దాడి

image

ఒంగోలు 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తాడి కృష్ణలత, ఆమె భర్త వెంకటేశ్‌పై శుక్రవారం అర్ధరాత్రి కొందరు దాడి చేశారు. దాడికి పూర్తి కారణాలు తెలియనప్పటికీ వ్యక్తిగత విభేదాలతో వారిపై దాడికి పాల్పడ్డినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో మద్యంమత్తులో వారిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా వారు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడింది సమీపంలోని వాళ్ళని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 1, 2025

వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే ఉగ్ర

image

కనిగిరిలో ఎమ్మెల్యే Dr.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, అభిమానులు, అధికారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పూల దండలు, బొకేలు, స్వీట్స్, పండ్లు తీసుకురాకుండా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి సహకరించాలని హుండీ ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టారు.

News January 1, 2025

పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.

News December 31, 2024

న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న బాపట్ల కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి వేడుకలు  జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.