News July 31, 2024
ఒంటరి మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

చీరాల మండలం ఈపూరుపాలెం పరిధిలో జరిగిన ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చీరాల డీఎస్పీ జగదీశ్ నాయక్ తెలిపారు. చీరాలలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. మృతురాలు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు కావడంతో ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో, కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న ఆంజనేయులు దాడి చేసి హత్య చేశాడన్నారు.
Similar News
News November 24, 2025
ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.


