News July 31, 2024

ఒంటరి మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

చీరాల మండలం ఈపూరుపాలెం పరిధిలో జరిగిన ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చీరాల డీఎస్పీ జగదీశ్ నాయక్ తెలిపారు. చీరాలలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. మృతురాలు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు కావడంతో ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో, కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఆంజనేయులు దాడి చేసి హత్య చేశాడన్నారు.

Similar News

News October 14, 2024

ప్రకాశం: కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.

News October 14, 2024

అందరూ సెలవు ఇవ్వాల్సిందే: ప్రకాశం కలెక్టర్

image

భారీ వర్షాలు, తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తమీమ్‌ అన్సారియా తెలిపారు. పిడుగులు, భారీ వర్షానికి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. అన్నీ ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇవ్వాల్సిందేనన్నారు. అలాకాదని ఎవరైనా పాఠశాలలు, కాలేజీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News October 14, 2024

ప్రకాశం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేఫథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ తమీమ్‌ అన్సారియా అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అత్యవసర సమయంలో కలెక్టరేట్‌లోని 1077కు కాల్ చేయాలన్నారు. ఒంగోలు RDO కార్యాలయంలోని 9281034437, 9281034441 నంబర్లను సైతం సంప్రదించవచ్చన్నారు. అలాగే కరెంట్ సమస్యలుంటే 9440817491 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.