News April 7, 2025

ఒంటిమామిడిపల్లి పాఠశాలను సందర్శించిన ఆకునూరి

image

ఒంటిమామిడిపల్లి పాఠశాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. విద్యార్థులను ఛైర్మన్ పలు అంశాల్లో ప్రశ్నించి వారి ప్రతిభా పాటవాలను మెచ్చుకున్నారు. తరగతి గదులు, ప్రీ ప్రైమరీ ప్లే టూల్స్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, మినరల్ వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

Similar News

News December 16, 2025

డేంజర్‌లో హైదరాబాద్‌

image

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్‌, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.

News December 16, 2025

నేడు విజయవాడకు రానున్న YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భవానీపురం జ్యోతినగర్‌కు వచ్చి, ఇటీవల 42 ఫ్లాట్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన బాధితులతో మాట్లాడతారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు పూర్తిచేశాయి.

News December 16, 2025

గిరి ప్రదిక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఈరోజు గిరిప్రదక్షిణ చేసిన వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. స్వామివారి నిజాభిషేకము అనంతరం గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు, సామాన్యులకు దర్శనం కల్పిస్తారు. టోకెన్లు అందజేయడంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.