News April 7, 2025
ఒంటిమిట్టకు రాష్ట్ర మంత్రుల రాక

రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం ఒంటిమిట్టకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒంటిమిట్టలో కోదండ రామునికి పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తారని చెప్పారు.
Similar News
News April 17, 2025
అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు: కడప కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.
News April 16, 2025
రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం: కలెక్టర్

రెవెన్యూ అధికారులు అన్ని రకాల ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు), చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కడప కలెక్టరేట్లోని సభా భవనంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత ముఖ్యం అన్నారు. అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకుని, మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.
News April 16, 2025
అట్లూరు: ఈతకు వెళ్లి బాలిక మృతి

అట్లూరు మండలం కమలకురులో ఈతకు వెళ్లి 15 ఏళ్ల తేజ మృతి చెందిన విషయం తెలిసిందే. తేజ నడుముకు కట్టుకున్న ప్లాస్టిక్ వస్తువు జారిపోవడంతో నీటిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలిక తండ్రి జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లారు. పాప మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.