News April 9, 2025
ఒంటిమిట్టకు సీఎం.. షెడ్యూల్ ఇదే.!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 11 న కడప జిల్లా పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 11వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకుంటారు. అనంతరం రామయ్యను దర్శించుకుని, కళ్యాణ వేడుకలో స్వామి వారికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు అందజేస్తారు. రాత్రికి ఒంటిమిట్ట గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు.
Similar News
News July 6, 2025
బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
News July 6, 2025
‘అల్లూరి జిల్లాకు రూ.10కోట్ల నిధులు’

అల్లూరి జిల్లా ఆకాంక్ష జిల్లా కావడం వలన నీతి ఆయోగ్ రూ.10కోట్ల నిధులు విడుదల చేసిందని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఆయా నిధులను విద్యాభివృద్ధికి వ్యయం చేస్తామన్నారు. జిల్లాలో 5 మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్ క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఫిజికల్ డైరెక్టర్లను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు.