News April 11, 2025

ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం చేపడతాం: సీఎం చంద్రబాబు

image

తిరుమల తరహాలో ఒంటిమిట్ట రాములోరి ఆలయంలోనూ అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భక్తులు ఆకలితో ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై టీటీడీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. త్వరలో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

కొత్తగూడెం: జూనియర్ కళాశాల వద్ద క్షుద్ర పూజల కలకలం

image

మణుగూరు జూనియర్ కళాశాల హరీకి ఆనుకొని ఉన్న రోడ్డుపై ముగ్గులు, నిమ్మకాయలతో కూడిన క్షుద్రపూజల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఉదయాన్నే కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కళాశాల ప్రాంగణంలో ఇలాంటి చర్యలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిఘా పెంచి ఆకతాయిల పనినా లేక మరేదైనా కారణమా అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 16, 2026

బంగ్లాదేశ్ క్రికెటర్ రుబెల్ రిటైర్మెంట్

image

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్(36) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ జట్టు తరఫున 27 టెస్టులు, 104 వన్డేలు, 28 టీ20లు ఆడి 193 వికెట్లు పడగొట్టారు. 2021 ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 మ్యాచే ఆయనకు చివరిది. గాయాలతో అప్పటి నుంచి జట్టుకు దూరమవుతూ వచ్చారు. ఇక వన్డేల్లో అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా రుబెల్ పేరిట రికార్డ్ ఉంది.

News April 16, 2026

పెద్ది రిలీజ్ డేట్ అందుకే ప్రకటించలేదా?

image

రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ రిలీజ్‌ను సినిమా యూనిట్‌ జూన్‌కు వాయిదా వేసింది. కానీ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే 2సార్లు పోస్ట్‌పోన్ అయిన నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని టాక్. జూన్‌ 4న యశ్ నటించిన ‘టాక్సిక్’ రిలీజ్ కానుంది. అది కూడా వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేయాలని పెద్ది యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.