News April 7, 2025

ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

Similar News

News December 9, 2025

మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

image

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

News December 9, 2025

ORR-RRR మధ్య KPHB తరహా కాలనీలు: పొంగులేటి

image

TG: HYD, చుట్టుపక్కల ఇళ్లు, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ‘అఫర్డబుల్ హౌసింగ్’ విధానాన్ని ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి పి.శ్రీనివాసరెడ్డి దీన్ని వెల్లడించారు. తెలంగాణ-2047 విజన్లో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్‌లకు అనుగుణంగా సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఆదాయం పరిమితులతో సంబంధం లేకుండా ORR-RRR మధ్య KPHB తరహా కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు.

News December 9, 2025

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్ వీడియో వైరల్.. తప్పెవరిది?

image

హార్దిక్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహికాశర్మ వీడియో ఒకటి SMలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించే ఫొటోగ్రాఫర్లపై హార్దిక్ <<18512560>>మండిపడ్డారు<<>>. హద్దుమీరి ఫొటోలు తీసే ముంబై కెమెరామెన్ల(పపరాజీ)పై గతంలో కొందరు సెలబ్రిటీలు ఆగ్రహించారు. వారి గురించి తెలిసి కూడా లోదుస్తులు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం ఎందుకని కొందరు నెటిజన్లు మహికాను ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం తప్పా అని మరికొందరు ఆమెకు మద్దతిస్తున్నారు.