News April 7, 2025
ఒంటిమిట్టలో మంత్రుల పర్యటన

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో ఆదివారం నుంచి ప్రారంభమైన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఆనం, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర పర్యవేక్షించారు. ముందుగా కోదండ రామస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
News April 22, 2025
టేకులపల్లి: అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

టేకులపల్లి మండలం బావోజీ తండాకు చెందిన భూక్య లాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అతనికి రూ.4 లక్షల అప్పు కావడం, ఈ మధ్యలో అతను అనారోగ్యం పాలై వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.
News April 22, 2025
ఏలూరు: ఉపాధ్యాయ పోస్టులకు అప్లై చేయండి: డీఈవో

ఉమ్మడి ప.గో జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15వ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీఐ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను పరిశీలించాలన్నారు.