News February 13, 2026
ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలని వినతి

ఓబులవారిపల్లె స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని రాజంపేట MP మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు భారత రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టకు భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సదుపాయాలు పెంచి అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ కల్పించాలని కోరారు. ఓబులవారిపల్లె రైల్వే స్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ పునరుద్ధరించాలని కోరారు.
Similar News
News March 13, 2026
WGL: నేటి నుంచి అన్నీ ఆన్ లైన్‌లోనే!

RTAలో అవినీతిని అరికట్టేందుకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి RTAలో పేపర్ లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్, ఫామ్ 20, ఇతర పత్రాలన్నీ స్కాన్ కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే డీలర్లు అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. నకిలీ పత్రాలను సమర్పిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
News March 13, 2026
పూతలపట్టు: పెట్రోల్ అయిపోవడంతో దొరికిపోయిన దొంగ

పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో ఓ బైక్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. రంగంపేట క్రాస్‌కు చెందిన హరిబాబు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్లాడు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. పెట్రోల్ అయిపోవడంతో ఆ దొంగ బైక్‌ను తోసుకుంటూ పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నట్లు తెలిసింది. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు.
News March 13, 2026
రెస్టారెంటు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో పలు రెస్టారెంట్లు బిల్లులో ‘LPG సర్‌ఛార్జ్’ కలిపి వేస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఉన్న నిల్వలనే వాడుకోవాల్సి రావడం, ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10-30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో టిఫిన్ రేట్లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.30-40 ఉండే మసాలా దోశ ధరను రూ.60కి పెంచేశారు.


