News April 12, 2025
ఒంటిమిట్టలో వైభవంగా శ్రీరాముడి రథోత్సవం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథాన్ని అధిష్టించి మాడ వీధుల్లో విహరించారు. భజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News November 25, 2025
కొడంగల్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో దాని వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన హన్మయ్య(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 25, 2025
అన్నమయ్య: నెరవేరిన సీఎం హామీలు

అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం(M) దేవగుడిలో ఇటీవల సీఎం చంద్రబాబు పర్యటించారు. కొందరి బంగారు రుణాలు మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఆయన ఆదేశాలతో కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించారు. DMF–CSR నిధుల నుంచి రూ.6.70 లక్షలు విడుదల చేశారు. మాలేపాటి హేమలత రూ.75వేలు, మాలేపాటి ఈశ్వర రూ.1.26లక్షలు, ముంతాజ్ బేగానికి రూ.4.69లక్షల చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు.
News November 25, 2025
ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం


