News May 25, 2024
ఒంటిమిట్టలో హరిత శోభకు TTD ప్రణాళిక

ఒంటిమిట్టలో హరిత శోభ కోసం TTD అధికారులు ప్రణాళిక రూపొందించారు. కోదండ రామాలయం పరిసర ప్రాంతాలు, కాలిబాటలు, సీతారాముల కళ్యాణ వేదిక, శృంగిశైలం, నాగేటి తిప్పపై పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం DFO శ్రీనివాసులు, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, హరికృష్ణల ఆధ్వర్యంలో అధికారుల బృంద సభ్యులు ఇక్కడికి వచ్చారు. నీడ, ఆహ్లాదం పెంచే మొక్కలు నాటి సంరక్షించాలని చర్చించారు.
Similar News
News February 19, 2025
కడప జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

కడప జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.