News March 22, 2024

ఒంటిమిట్టలో 25న పౌర్ణమి కళ్యాణం

image

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Similar News

News April 17, 2025

ప్రొద్దుటూరులో ఒకేరోజు 60 తులాల బంగారం చోరీ.. 18 కేజీల పసిడి పట్టివేత

image

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యెనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులెవ్వరూ లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపున స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఒక కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.

News April 17, 2025

కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎన్నిక

image

కొండాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న జి.రామకృష్ణారెడ్డి కడప జిల్లా లెక్చరర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కడప పట్టణంలోని STUAP భవనంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కొండాపురం కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లు జయాకర్, రవికుమార్, మహబూబ్ బాషా, వేణుగోపాల్, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News April 17, 2025

కడప: 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య?

image

కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాశ్‌కు చెందిన సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కి వెళ్ళి చొక్కా గ్రిల్‌కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!