News March 22, 2024
ఒంటిమిట్టలో 25న పౌర్ణమి కళ్యాణం
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News September 20, 2024
కడప జిల్లాకు పవర్ లిఫ్టింగ్‌లో పతకాల పంట
ఆర్కే వ్యాలీ IIIT పవర్ లిఫ్టింగ్ టీం కడప జిల్లా తరఫున ఇటీవల అమలాపురంలో జరిగిన ఏపీ 11వ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. టీమ్ చాంపియన్షిప్ సబ్ జూనియర్ విభాగంలో గర్ల్స్ ఫస్ట్ ప్లేస్, బాయ్స్ సెకండ్ ప్లేస్ కైవసం చేసుకున్నారు. మొత్తం 8 బంగారు, 7 రజిత, 1 కాంస్య పతకాలు సాధించారు. ఇందులో అమ్మాయిలు 6 బంగారు, 4 రజిత, 1 కాంస్య, అబ్బాయిలు 2 బంగారు, 3 రజిత పతకాలు సాధించారు.
News September 20, 2024
బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి
వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.