News April 11, 2025
‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలను అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
Similar News
News December 20, 2025
NZB: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.
News December 20, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

మీరు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది అదృష్టాన్ని పొందాలనుకుంటున్నారా? వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ చేయించుకోవడం ద్వారా వైకుంఠ ద్వారం తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొంది, అన్ని పాపాల నుంచి విముక్తి చెంది, శ్రేయస్సుతో కూడిన మోక్ష మార్గాన్ని పొందండి. మీ పేరు & గోత్రంతో సంకల్పం నమోదు చేసుకుని వెంటనే వేదమందిర్లో <
News December 20, 2025
ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


