News April 11, 2025
‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలను అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
Similar News
News April 19, 2025
‘పెద్ది’లో కాజల్ స్పెషల్ సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కాజల్‌ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్.
News April 19, 2025
పల్నాడు జిల్లాకు మహర్దశ

రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌లో జిల్లాను కలపటంతో పల్నాడుకు మహర్దశ పట్టింది. కొండమోడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభానికి సిద్ధం కావడంతో అమరావతికి రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. కృష్ణానది పరివాహ ప్రాంతం కావడంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, ఎత్తిపోతల, అమరావతి, కొండవీడు, కోటప్పకొండ, దైద, గుత్తికొండ వంటి పర్యాటక ప్రాంతాలు జిల్లా పరిధిలోకి ఉండటంతో బలమైన జిల్లాగా రూపాంతరం చెందింది.
News April 19, 2025
సంతనూతలపాడు MLA టికెట్ పేరుతో మోసం

ఎమ్మెల్యే టికెట్ పేరుతో ప్రకాశం జిల్లాలో మోసం జరిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ అదే పార్టీకి చెందిన నాగలక్ష్మి, ఆమె భర్త సతీశ్ రూ.10 లక్షలు తీసుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. నగదు తీసుకుని తనను మోసం చేశారని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.