News April 10, 2025
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి బస్సు సర్వీసులు

ఒంటిమిట్టలో జరగనున్న కోదండ రామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా 11వతేదీ 145 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ కడప రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, మైదుకూరు 7, ప్రొద్దుటూరు 17తో పాటు ఇతర డిపోలు (రాయచోటి, రాజంపేట) నుంచి మరో 40 బస్సులు ఒంటిమిట్టలో కల్యాణోత్సవం జరిగే ప్రాంతం వరకు చేరుకుంటాయన్నారు.
Similar News
News February 9, 2026
ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.
News February 9, 2026
కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
☛ నంద్యాల ఫ్యాక్షన్ జోన్‌కు ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ సీఐ రియాజ్ అహ్మద్ బదిలీ
☛ గోవిందరెడ్డి కడప VR నుంచి ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్ బదిలీ
☛ దస్తగిరి కడప VR నుంచి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్‌కు బదిలీ
☛ లింగప్ప బద్వేల్ నుంచి మన్నూరుకు బదిలీ
☛ రామకృష్ణ సత్యసాయి జిల్లా నుంచి బద్వేల్‌కు బదిలీ.
News February 9, 2026
ఆర్థిక అక్షరాస్యత పై విస్తృతంగా అవగాహన కల్పించండి: కలెక్టర్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలపై ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌తో కలసి ఆవిష్కరించారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.


