News April 11, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవం.. భారీ బందోబస్తు

ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. నలుగురు ఏఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, హోం గార్డులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
ఈనెల 7న కడపకు YS జగన్

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.
News July 6, 2025
కడప: ‘రిమ్స్‌లో తనిఖీలు’

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు పద్మావతి శనివారం పర్యటించారు. పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్ఐసీయూలో పుట్టిన బిడ్డల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు వచ్చే పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించి ఆర్టీసీ అధికారులు, విద్యాలయ అధ్యాపకులతో చర్చించారు.
News July 5, 2025
ఎర్రగుంట్ల: ‘RTPPలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింపు’

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650MW. వీటినుంచి ఏప్రిల్‌లో 839.98MU, మేలో 616.31MU, జూన్‌లో 729.28MU విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(PLF) మాత్రమే ఉపయోగిస్తున్నారు. RTPPలో 210X5MW, 600X1MW యూనిట్లు ఉన్నాయి.