News April 9, 2025
ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
Similar News
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 7, 2025
వందేమాతరం గొప్ప గేయం: కడప SP

వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే గొప్ప గేయం వందేమాతరం అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
నేడు కడపలో భారీ ర్యాలీ

WWC భారత్ గెలిచిన తర్వాత తొలిసారి కడపకు నల్లపురెడ్డి శ్రీచరణి నేడు రానున్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఇర్కాన్ సర్కిల్ వద్ద సాయంత్రం స్వాగతం పలుకుతారు. తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేస్తారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆమెను సన్మానిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె సాయంత్రానికి కడపకు వస్తారు.


