News March 17, 2025
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

ఏప్రిల్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒంటిమిట్ట ఆలయం, 4 మాడవీధులు, కళ్యాణ వేదిక, పార్కింగ్ ఇతర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సమీక్షించారు.
Similar News
News March 18, 2025
కడప జిల్లాకు మరోసారి పేరు మార్పు

ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ‘కడప’ పేరు మరోసారి మారింది. ఇక నుంచి YSR కడప జిల్లాగా పరిగణించాలని కూటమి ప్రభుత్వం కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా అయిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో కడపను తొలగించి YSR జిల్లాగా మార్చారు. కడపను మళ్లీ కలిపి YSR కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోమారు జిల్లా పేరు మార్పుపై మీ కామెంట్ తెలపండి.
News March 18, 2025
ఎర్రగుంట్లలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులోని మై హోమ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
పెండ్లిమర్రి: నేడు నరసింహస్వామికి విశేష పూజలు

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేయి నూతుల కోనలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నేడు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో తెల్లవారుజామునే స్వామి వారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.