News April 11, 2025

ఒంటిమిట్ట రామదాసు ఈయనే..

image

భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.

Similar News

News April 23, 2025

‘పేదరికం నుంచి బయటకి వచ్చేలా అవగాహన కల్పించాలి’

image

బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకి తెచ్చేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పి4 అమలు తీరుపై జిల్లా, మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం, వారి భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికతో అవగాహన కల్పించడం ముఖ్యమని కలెక్టర్ చెప్పారు.

News April 23, 2025

పాకిస్థాన్‌కు భారత్ బిగ్ షాక్

image

పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసిన నేపథ్యంలో పాక్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశం లభించింది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. సింధుకు ఉప నదులైన చీనాబ్​, జీలం భారత్‌లో పుట్టగా, చైనాలో జన్మించిన సింధు..IND నుంచి పాక్‌లోకి ప్రవహిస్తుంది.

News April 23, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ ఆదోని మార్కెట్లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు ☞ గాజులపల్లె వద్ద రైలు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు ☞ టెన్త్ ఫలితాల్లో నంద్యాల జిల్లాకు 17వ స్థానం ☞ అధికారులపై పాణ్యం MLA ఆగ్రహం ☞ పాణ్యంలో అత్యధికంగా 44⁰C ☞ పర్యాటకంగా అభివృద్ధికి కృషి చేయండి: జేసీ ☞నంద్యాలలోని ఓ ఇంట్లో 12 అడుగుల కొండచిలువ ☞ పహల్గామ్ ఘటనపై మంత్రి బీసీ, ఎంపీ శబరి విచారం ☞ ఆర్యవైశ్యుల అభివృద్ధికి TDP అండ: మంత్రి ఫరూక్

error: Content is protected !!