News April 10, 2025
ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని సేవలో కడప కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం గరుడ సేవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ కుటుంబ సమేతంగా శ్రీ సీతారామలక్ష్మణులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
Similar News
News November 27, 2025
బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.
News November 27, 2025
ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
News November 27, 2025
కరెంట్ షాక్తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.


