News March 31, 2025
ఒంటిమెట్ట రాములోరికి నంద్యాల తళంబ్రాలు సిద్ధం

ఒంటిమిట్ట శ్రీ రాములవారి కళ్యాణం కోసం భక్తులు వడ్లను గోటితో ఒలిచిన తళంబ్రాలను నంద్యాల సంజీవనగర్ రామాలయంలో శ్రీ కోదండ రామస్వామి సమక్షంలో పూజ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వడ్లను భక్తులు రామాలయంలో గోటితోనే ఒలుస్తారని తెలిపారు. ఆ తళంబ్రాలను కళ్యాణం సమయంలో రాముల వారి చెంతకు చేరుస్తారని అర్చకులు తెలిపారు.
Similar News
News November 20, 2025
భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

భిక్కనూర్లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిసింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. పేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.
News November 20, 2025
HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.


