News January 13, 2026

ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్!

image

TG: రాష్ట్రంలో పండగ వేళ ఎన్నికల సందడి మొదలుకానుంది. మున్సిపల్ ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల చేయడంతో షెడ్యూల్ రిలీజ్‌కు SEC సిద్ధమైంది. 1,2 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. FEB రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నెల 20 నాటికి రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SC, ST, డెడికేషన్ కమిషన్ ఆధారంగా BC రిజర్వేషన్లను ప్రకటించనుంది.

Similar News

News February 15, 2026

కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

image

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్‌గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్‌ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.

News February 15, 2026

శివరాత్రి.. ఈ తప్పులు చేయకండి!

image

మహాశివరాత్రి నాడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూజా ఫలం దక్కదని పండితులు అంటున్నారు. ‘తులసి ఆకులతో పూజ చేయొద్దు. శివుడికి బిల్వపత్రాలంటేనే ఇష్టం. లింగానికి పసుపు, కుంకుమ పూయొద్దు. విభూతి రాయాలి. శంఖం, రాగి పాత్రతో అభిషేకం చేయొద్దు. ఉపవాసం ఉన్న వాళ్లు మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. జాగరణ అంటే వినోదం, కాలక్షేపం కాదు.. ఓం నమశ్శివాయ మంత్రాన్ని స్మరించాలి’ అని చెబుతున్నారు.

News February 15, 2026

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.