News March 25, 2024

ఒకప్పటి నిజామాబాద్ కలెక్టర్..ఇప్పుడు MLA అభ్యర్థి

image

ఒకప్పుడు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్‌ ఈసారి ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఖరారు చేశారు. 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరక్టర్, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా ఆయన సేవలందించారు.

Similar News

News December 9, 2025

నిజామాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, సాలూర, నవీపేట్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లోని 184 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 8, 2025

నిజామాబాద్: వారంరోజుల్లో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.

News December 8, 2025

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత: సీపీ సాయి చైతన్య

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సీపీ పి. సాయి చైతన్య నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,384 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేశారు. మూడు చెక్ పోస్ట్‌లను నెలకొల్పి, 361 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 183 మందిని బైండోవర్ చేసి, నియమావళి ఉల్లంఘించినందుకు మూడు కేసులు నమోదు చేశారు.