News November 5, 2024

ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా

image

చీడికాడ మండలం పెదగోగాడకి చెందిన <<14532774>>రెడ్డి సత్యనారాయణ<<>> మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇండిపెండెంట్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1984లో టీడీపీలో చేరి మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడుగా సేవలందించారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. కాలినడకన, సాధారణ బస్సుల్లోనే ప్రయాణించేవారు. స్థానిక ప్రజలు ఆయనను సత్యం మాస్టారు అంటారు.

Similar News

News November 22, 2025

తాటిచెట్లపాలెం: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

image

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.