News November 5, 2024

ఒకే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా

image

చీడికాడ మండలం పెదగోగాడకి చెందిన <<14532774>>రెడ్డి సత్యనారాయణ<<>> మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇండిపెండెంట్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1984లో టీడీపీలో చేరి మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడుగా సేవలందించారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు. కాలినడకన, సాధారణ బస్సుల్లోనే ప్రయాణించేవారు. స్థానిక ప్రజలు ఆయనను సత్యం మాస్టారు అంటారు.

Similar News

News December 8, 2024

పాడేరులో ఉద్యోగిపై పోక్సో నమోదు

image

పాడేరు ఏకలవ్య మోడల్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్‌పై పోక్సో కేసు నమోదు చేశామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజిని శనివారం తెలియజేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి.అభిషేక్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News December 8, 2024

ఏయూకి పూర్వవైభవం తీసుకురావడానికి సహకరించాలి: లోకేశ్

image

ఏయూకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్నీ మీట్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఏయూని ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు.

News December 7, 2024

పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న హోం మంత్రి అనిత

image

విశాఖ ఆరిలోవలో నిర్మించిన నూతన పోలీసు స్టేషన్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పాల్గొనున్నారు. సుమారు ఆరేళ్ల నుంచి ఈ భవన నిర్మాణానికి మీనమేషాలు లెక్కిస్తూ నేటికి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాటు చేశారు.